వైఎస్సార్ సీపీలోకి నెల్లూరు కాంగ్రెస్ నేతలు | Nellore Congress Leaders joins YSR Congress | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలోకి నెల్లూరు కాంగ్రెస్ నేతలు

Dec 27 2013 12:35 AM | Updated on May 25 2018 9:12 PM

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనుచరులు పలువురు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సాక్షి, హైదరాబాద్: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అనుచరులు పలువురు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన వీరికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, సన్నపురెడ్డి పెంచల్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మంచికంటి శ్రీనివాసులు, ఆటోనగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సలీం, నెల్లూరు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దాస లక్ష్మీనారాయణ, నెల్లూరు దాల్‌మిల్లర్స్ సంఘం అధ్యక్షుడు చలువాది నాగేశ్వరరావు తదితరులున్నారు.
 
వైఎస్సార్‌సీపీలో చేరిన విద్యాసాగర్


కృష్ణా జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ దివంగత కుక్కల నాగేశ్వరరావు తనయుడు డాక్టర్ కె.వి.ఆర్.విద్యాసాగర్ గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసంలో విద్యాసాగర్‌కు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి(సీఈసీ) సభ్యునిగా ఉన్న కుక్కల నాగేశ్వరరావు ఇటీవల గుండెపోటుతో మరణించడం తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement