మున్సిపల్ సేవల్లో నిర్లక్ష్యం | Neglect municipal services | Sakshi
Sakshi News home page

మున్సిపల్ సేవల్లో నిర్లక్ష్యం

Mar 17 2014 2:37 AM | Updated on Oct 16 2018 6:27 PM

ఇచ్ఛాపురం మండలం, మున్సిపల్ ప్రజలకు పట్టణంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆస్పత్రే దిక్కు. ఆస్పత్రి భవనం గత ఏడాది సంభవించిన పై-లీన్ తుపానుకు ధ్వంసం కావడంతో పక్కనే

గైనకాలజిస్టు లేక ఇబ్బందులు 
  ఇచ్ఛాపురం మండలం, మున్సిపల్ ప్రజలకు పట్టణంలో ఉన్న ప్రభుత్వ సామాజిక ఆస్పత్రే దిక్కు. ఆస్పత్రి భవనం గత ఏడాది సంభవించిన పై-లీన్ తుపానుకు ధ్వంసం కావడంతో పక్కనే ఉన్న సమగ్ర మాతా శిశు అత్యవసర కేంద్రం(సిమాంక్) లోకి మార్చారు. పాత భవనంలో ఒక్క ఎక్సరే విభాగాన్ని మాత్రమే నిర్వహిస్తున్నారు. 
 
  ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు చేసే థియేటర్ లేకపోవడంతో సేవలు పూర్తిస్థాయిలో అందడంలేదు. గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. 
 
  మునిసిపాల్టీకి దూరంగా ఉన్న గ్రామాలకు వైద్య సేవలు అందుబాటులో లేవు. రత్తకన్న గ్రామంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్‌ను పట్టణానికి తరలించడంతో ఆ ప్రాంత వాసులకు వైద్యసేవలు దూరమయ్యాయి. మూడు వార్డులు సుమారు 7 వేల మందికి పైగా జనాభా ఉన్న పురుషోతపురం, అమీన్‌సాహెబ్ పేట గ్రామాల్లో 
  ఆరోగ్య కేంద్రాలు నిర్మించాల్సి ఉన్నా పట్టించుకునేవారే లేరు. 
 
 -న్యూస్‌లైన్, ఇచ్ఛాపురం 
 
 వైద్యసేవలు అందడం లేదు 
 ప్రభుత్వాస్పత్రిలో గర్భిణులకు సరైన వైద్య సేవలందడం లేదు. కనీసం వారి ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి గైనకాలజిస్టు కూడా లేకపోవడం అన్యాయం. అస్పత్రిలో పరిశుభ్రత కరువైంది. 
 - సీహెచ్ కృష్ణ, 
 ఇచ్ఛాపురం 
 
  రోగులు ఫుల్.. సేవలు నిల్..!
  పాలకొండ డివిజన్ కేంద్రంలో ఉన్న సర్కారు దవాఖానా స్థాయి మార కపోరుునా సమస్యలు పెరిగారుు. వైద్యులు లేక, మందులు అరకొరగా అందించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజు 300 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నా సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి.  సెంట్రల్ డ్రగస్ హౌస్ నుంచి వచ్చిన మందులు చాలాకపోవడంతో రోగులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. డివిజన్‌లో ఏజెన్సీ ప్రాంతానికి పెద్దదిక్కుగా ఉన్న ఈ ఆస్పత్రికి పాలకొండ మండలంతో పాటు బూర్జ, వీరఘట్టం, రేగిడి, కొత్తూరు, సీతంపేట, భామిని మండలాల నుంచి నిత్యం రోగులు వస్తారు. అరుుతే, వైద్యాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ఇద్దరు స్త్రీవైద్య నిపుణులున్నా మహిళలకు సకాలంలో వైద్యసేవలు అందడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాన్ని కేంద్రాస్పత్రిగా మార్చుతానని ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవులు పలుసార్లు హామీ ఇచ్చినా ఆచరణలోకి తేలకపోయూరు. దీంతో ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరలేదు. కనీసం నగర పంచాయతీ కాలంలోనైనా స్థాయిపెరుగు తుందన్న ఆశతో ఉన్నారు. 
 - న్యూస్‌లైన్, 
 పాలకొండ రూరల్
 
 
 కాంట్రాక్టర్లకే ప్రయోజనం! 
 ఎలాంటి చిన్న అనారోగ్యానికి గురైనా పట్టణంలోని పేదలందరూ ఆశ్రరుుంచేది ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలనే. అక్కడ అందించే సేవలే వారి ఆరోగ్యానికి శ్రీరామరక్ష. అరుుతే, వేళలు పాటించని వైద్యాధికారులు, అంతంత మాత్రంగా ఉన్న వైద్య సిబ్బంది, మందుల కొరత, అందుబాటులో లేని ఆధునిక పరికరాలు, అధ్వానంగా ఉన్న ఆస్పత్రి పరిసరాలు రోగులకు శాపంగా మారారుు. అత్యవసర వేళలో వెళ్తే... అమ్మో..! మేము వైద్యం చేయలేమంటూ వేరే ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement