అనంతపురం జిల్లా కదిరిలో ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు జరగనుంది
అనంతపురం : అనంతపురం జిల్లా కదిరిలో ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్త వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సు జరగనుంది. పరిశోధనా కేంద్రంలోని ప్రధాన శాస్త్రవేత్తలు కే శివశంకర్ నాయక్, డా. సంపత్‌కుమార్‌లు, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌భాషా బుధవారం విలేకరులకు సదస్సు వివరాలను తెలిపారు. దేశవ్యాప్త వ్యవసాయ శాస్త్రవేత్తల సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న 22 వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి సుమారు 150 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరు కానున్నారని తెలిపారు.ఏడాదికి ఒకసారి జరిగే ఇలాంటి వర్క్‌షాప్‌లు ఇప్పటిదాకా పెద్ద పెద్ద నగరాల్లోనే జరిగాయని, కదిరి లాంటి తాలూకా కేంద్రంలో జరగడం ఇదే ప్రప్రథమమని తెలియజేశారు.
(కదిరి)