
కిడ్నాపైన బాలుడు చివరికి శవమై తేలాడు..
విజయవాడ చిట్టినగర్ లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఓ బాలుడు చివరకు శవమై తేలాడు.
విజయవాడ: విజయవాడ చిట్టినగర్ లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం కిడ్నాప్ అయిన ఓ బాలుడు చివరకు శవమై తేలాడు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 14న ఆరేళ్ల సాయి ధర్మతేజ అదృశ్యమయ్యాడు. కుమారుడి కోసం అతడి తల్లిదండ్రులు ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో వారు 16వ తేదీన విజయవాడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాగా కేఎల్‌రావు నగర్‌లో అవుట్‌పాల్ కాల్వలో ఆరేళ్ల వయసున్న ఓ బాలుడి మృతదేహాన్ని స్థానికులు సోమవారం ఉదయం చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఈ నెల 15న కలర్ హాస్పిటల్ ప్రాంతం నుంచి అదృశ్యమైన సాయి ధర్మతేజగా గుర్తించారు. బాలుడు కనిపించకుండాపోయిన ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా అతడు శవమై కనిపించడంతో పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.