గోదావరి జిల్లాల పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

Minister Peddireddy ramachandra Reddy Review Of Rain floods Areas - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నత అధికారులతో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.  చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడి పరిస్థిలు తెలుసుకున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశం జరిగింది. వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కల్పనపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వ్యాధుల బారీన పడకుండా పారిశుద్ద్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసర వస్తువలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter | తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top