‘పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులైనా.. పథకం వర్తిస్తుంది’

Minister Kodali Nani Talks In YSR Raithu Bharosa Scheme Programme In Vijayawada - Sakshi

సాక్షి, కృష్ణా :  ‘వైఎస్సార్‌ రైతు భరోసా.. పీఎం కిసాన్‌’ కార్యక్రమాన్ని గుడివాడ మార్కెట్‌ యార్డులో పౌర సరఫరాల, వినియోగదారుల శాఖ మంత్రి కొడాలి నాని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అర్హులైన రైతులకు చెక్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతు కన్నీరు పెడితే రాష్ట్రానికి, దేశానికి మంచిది కాదని నమ్మే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వ్యాఖ్యానించారు. రైతు భరోసాను రూ.12,500 నుంచి రూ13,500లకు పెంచిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద నాలుగేళ్లలో రూ. 50 వేలు ఇస్తానన్న సీఎం మరో ఏడాదిని పెంచి ఐదేళ్లలో రూ. 67,500 ఇవ్వనున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కంటే అదనంగా మరో 17,500 ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు ఏటా రూ.12,500లకు బదులుగా రూ. 13,500 జగన్‌ ప్రభుత్వం ఇవ్వబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎట్టి పరిస్థితిలోనూ అర్హత ఉన్నవారు మిగిలిపోకుడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

ఇందులో భాగంగా దరఖాస్తు గడువును నవంబర్‌ 15 వరకూ పొడిగించామని మంత్రి కొడాలి నాని తెలిపారు. గత ప్రభుత్వంలో ప్రజా సాధికారత సర్వే ద్వారా ఎంపికైన రైతులు 43 లక్షలు ఉంటే తమ ప్రభుత్వంలో 51 లక్షల మంది ఉన్నారని, వారితో పాటు అదనంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి చెందిన మరో 3 లక్షల మంది రైతులకు కూడా ఈ పథకాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. ఒకవేళ అర్హుడైన రైతు మరణిస్తే ఈ పథకం ఆ రైతు భార్యకు వర్తించేలా సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంతో దాదాపు రాష్ట్రంలో 1.15 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. రైతు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటే వారికి కూడా ఈ ఫథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top