శాశ్వత పరిష్కారం చూపుతాం - మంత్రి అవంతి

Minister Avanti Said YS Jagan Mohan Reddy Will Provide A Lasting Solution To The Land Acquisition Of Simhachalam Pancha Villages - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ శనివారం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని సింహాచలం పంచ గ్రామాల భూసమస్య పరిష్కారం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో అధికారంలో  ఉన్న టీడీపీ సర్కారు ఎన్నికలకు ముందు తప్పుడు జీవోల పేరుతో మాయ చేసిందే తప్ప సమస్యకు పరిష్కారం చూపలేదు. ఫలితంగా పీఠాధిపతులు కోర్టును ఆశ్రయించారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రజలు విన్నవించిన ఈ సమస్యను అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ హామీని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో  ప్రయత్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఈ అంశంపై  న్యాయ నిపుణులతో చర్చలు  జరపడమే కాకుండా.. పంచ గ్రామాల భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం లభించేలా సమగ్రమైన జీవో ఇచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top