అనుమానాస్పద స్థితిలో రైతు కూలీ మృతి చెందాడు.
చౌడేపల్లి : అనుమానాస్పద స్థితిలో రైతు కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని ముతకపల్లెలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పి. వెంకటరమణ(45) అనే వ్యక్తి సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో గొడవ పెట్టుకొని ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. మంగళవారం గ్రామ సమీపంలోని ఇసుకబావి వద్ద మృతదేహంగా కనిపించాడు. గ్రామస్తులు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతని మృతదేహాం రక్తం మడుగులో పడి ఉంది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా హత్య చేశారా? లేక తనే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.