అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మానేరు శివారులో శుక్రవారం చోటు చేసుకుంది.
సుల్తానాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మానేరు శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. మాన కొండూరు మండలం ఓపూరు గ్రామానికి చెందిన వేముల నందయ్య(33) అనే వ్యక్తి ఆలయ సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నందయ్య ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఎవరైన హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.