గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే నెపంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు.
దొంగతనం నెపంతో దాడి: వ్యక్తి మృతి
Feb 19 2016 11:34 AM | Updated on Aug 30 2018 5:27 PM
రాజుపాలెం: గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లిలో ఓ వ్యక్తిని దొంగతనం చేశాడనే నెపంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన ఓర్సు పేతూరు బాబు(35) అనే వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. పేతూరు బాబు ఇంటి పక్కన ఉన్న బత్తుల కోటేశ్వరరావు ఇంట్లో మూడు రోజుల క్రితం రూ.800 నగదు మాయమయ్యాయి. నగదు పేతూరు బాబే కాజేశాడనే కారణంతో కోటేశ్వరరావు, మరో వ్యక్తి కలిసి బాబును చితక బాదారు.
దాడిలో తీవ్రగాయాల పాలైన పేతూరుబాబును చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. కొట్టిన దెబ్బలవల్ల శరీరంలో పలుచోట్ల రక్తం గడ్డకట్టినట్లు డాక్టర్లు తెలపడంతో నయం చేయించుకునే స్తోమత లేక తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి వచ్చిన తర్వాత స్థానికంగా చికిత్సపొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement