భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రిని జిల్లా ప్రజలు మంగళవారం జరుపుకున్నారు.
మార్మోగిన శివనామస్మరణ
పరమేశ్వరుడికి అభిషేకాలు
జిల్లాలో ఆలయాలు కిటకిట
భక్తిశ్రద్ధలతో మహాశివరాత్రిని జిల్లా ప్రజలు మంగళవారం జరుపుకున్నారు. హరహరమహాదేవ శంభోశంకర అంటూ శివనామస్మరణతో రావికమతం మండలం కళ్యాణపులోవ, హుకుంపేట మండలం మత్స్యగుండం, నర్సీపట్నంలోని ఉత్తరవాహిని, రాంబిల్లి మండలం పంచదార్ల, తదితర ప్రాంతాల్లోని ఆలయాలు మారుమోగాయి.
వేకువజామునుంచి భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. అభిషేకాలు చేయించుకున్నారు. రోజంతా ఉపవాసం పాటించారు. తెల్లవార్లూ జాగరణ చేశారు. కళ్యాణపులోవ జలాశయంలో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించారు.