రాజకీయ నేతలు దేశ సంపదను దోచుకుంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ఆరోపించారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ఆరోపణ
పీలేరు, న్యూస్‌లైన్: రాజకీయ నేతలు దేశ సంపదను దోచుకుంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ఆరోపించారు. ప్రజాస్వామ్యం ముసుగులో రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం అరవవాండ్లపల్లెకు చెందిన న్యాయవాది నారాయణరెడ్డి నిర్మించిన అనాథాశ్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హృదయాన్ని కదిలించే సంఘటన సమాజ సేవ ఒక్కటేనన్నారు. సమాజంలో ఉన్నత చదువులు చదివినవారు అవినీతిపరులుగా మారుతున్నారని, ఇది దేశానికి మంచిదికాదన్నారు. దేశం అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం అధ్యాపకులేనని విమర్శించారు. రాజకీయాలు భ్రష్టుపట్టిన సమయంలో అనుకోకుండా ఉపాధ్యాయ వృత్తి నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని యండపల్లె శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నీతికి నేటి రాజకీయాలలో చోటు లేదన్నారు.