రాబోయే ఎన్నికల్లోనూ భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
చౌటుప్పల్, న్యూస్‌లైన్ :రాబోయే ఎన్నికల్లోనూ భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం చౌటుప్పల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మునుగోడు, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో తమకు పడని వ్యక్తులు దుష్ర్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ము ప్రజల కోసం పనిచేస్తున్నామని, కానీ కాంట్రాక్టుల కోసం పనిచేస్తున్నారని కొంతమంది విమర్శించడం వల్లే, నేనూ వారి గురించి మాట్లాడాల్సి వస్తుందన్నారు. కాంట్రాక్టుల కోసమే అయితే సీఎంను అంటిపెట్టుకొని ఉండేవారమని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసేవారా అని ప్రశ్నిం చారు.
నేను భువనగిరి ఎంపీగా సిట్టింగ్ స్థానంలో ఉన్నప్పటికీ, మునుగోడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కొంతమంది దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. ఖమ్మం నుంచి వలస వచ్చి, తుంగతుర్తిలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతున్న ఓ రౌడీ కుమారుడు నా సిట్టింగ్ స్థానంలో పోటీ చేస్తాడట అని రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తుంగతుర్తిలో వారు గత 30ఏళ్ల కాలంలో 25మందిని పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా శనిలా దాపురించిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తన బిడ్డ ఎమ్మెల్యే కావాలని పాకులాడుతున్నారన్నారు. బిడ్డను సీమాంధ్రకిచ్చి, ఇక్కడ పోటీ చేయిస్తే ఓట్లెవరేస్తారన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారినే ఆదరిస్తారని, సీమాంధ్ర వారికి ఓట్లేయరని పాల్వాయి స్రవంతిని ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్, కోమటిరెడ్డి బ్రదర్స్‌లను తిట్టి పాల్వాయి రాజ్యసభ పదవిని తెచ్చుకున్నారన్నారు.
కుటుంబ రాజకీయాల కోసం ఆయన పాకులాడుతున్నారని, ఇదేం రాచరికం కాదన్నారు. పాల్వాయి కూతురు పోటీ చేస్తే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో మరో 30ఏళ్లు వెనక్కి వెళ్తుందన్నారు. కుటుంబ పాలన వద్దని, సద్విమర్శలు చేసి పదవి గౌరవం కాపాడాలని పాల్వాయికి హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసిన వారికే కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు ఇస్తుందన్నారు. అధిష్టానం టికెట్లిలిచ్చినా వారి గెలుపు కోసం కృషి చేసేందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ముందుంటారన్నారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబ్బు వెంకటయ్య, డీసీసీ కార్యదర్శి సుర్వి నర్సింహగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు బడుగు మాణిక్యం, మాదని యాదయ్య, నాయకులు బోయ రామచంద్రం, రావుల అంజయ్య, మహంకాళి మైసయ్య, ఇంతియాజ్‌పాషా, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, చింతల సాయిలు, కొంతం రాంరెడ్డి, వర్కాల మహేందర్, చెక్క లక్ష్మమ్మ, జీండ్రు అంజిరెడ్డి, చెక్క బాలకిషన్, మల్లికార్జున్‌రెడ్డి, రమేష్, బుచ్చిరెడ్డి, యాదయ్య, సత్యం, మునీర్, రఫీ, శంకర్‌జీ, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


