తెలంగాణ దగ్గరికి వచ్చిందని, సీఎం కిరణ్ ఆపినా ఆగదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ దగ్గరికి వచ్చిందని, సీఎం కిరణ్ ఆపినా ఆగదని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కిరణ్ ఎన్ని బంతులు వేసినా 23 వరకేనని, ఆ తర్వాత బిల్లు ఢిల్లీకి పోతుందని స్పష్టం చేశారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జంట నగరాల ఓల్డ్ పేపర్స్, మెటీరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాల్సిన అవసరం లేదని, శాంతిభద్రతలు గవర్నర్ చేతుల్లో ఉంచరాదని, హైకోర్టును రెండు భాగాలుగా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్, జంట నగరాల ఓల్డ్ పేపర్స్, మెటీరియల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రేమ్‌సింగ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.