సచివాలయం వద్ద ఖైరతాబాద్ గణేషుడు | Khairatabad Ganesh Shobha Yatra continuous | Sakshi
Sakshi News home page

సచివాలయం వద్ద ఖైరతాబాద్ గణేషుడు

Sep 19 2013 8:29 AM | Updated on Sep 1 2017 10:51 PM

ఖైరతాబాద్ గణనాధుని శోభాయాత్ర కొనసాగుతోంది. అర్థరాత్రి నుంచి ప్రారంభం అయిన శోభాయాత్ర ప్రస్తుతం సచివాలయం వద్దుకు చేరుకుంది.

హైదరాబాద్ : ఖైరతాబాద్ గణనాధుని శోభాయాత్ర  కొనసాగుతోంది. అర్థరాత్రి నుంచి ప్రారంభం అయిన శోభాయాత్ర ప్రస్తుతం సచివాలయం వద్దుకు చేరుకుంది. నిమజ్జనానికి లంబోధరుడు ముందుకు సాగుతున్నాడు.  కాగా ఈరోజు మధ్యాహ్నం వరకూ నిమజ్జనం కొనసాగనుంది. అప్పటివరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మరోవైపు నిమజ్జనం కోసం భారీగా గణనాధులు కొలువుతీరారు.

ఇక  తొమ్మిదిరోజుల పాటు యావత్‌రాష్ట్రంలోనూ ఉత్సవహేలగా సాగిన గణపతి వేడుకలు నిన్నటితో ముగిసాయి. భాగ్యనగరంలో వీధివీధినా ఊరేగింపుగా సాగిన గణపతి వీడ్కోలు చెబుతూ నిమజ్జనమయ్యాడు. కుంభవృష్టిని సైతం లెక్కచేయకుండా జనం వేలాదిగా ఈ నిమజ్జనోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement