జపనీయులు వస్తున్నారని... | Japanese are coming .. | Sakshi
Sakshi News home page

జపనీయులు వస్తున్నారని...

Mar 5 2015 2:46 AM | Updated on Sep 28 2018 7:14 PM

జపనీయులు వస్తున్నారు... ఉండవల్లి గుహలు చూస్తారంటా... వారికి చరిత్ర వివరించాలంటా... భారీ సంఖ్యలో వచ్చేవారికి అతిథి మర్యాదలు చేయాలంటా..

తాడేపల్లి రూరల్ : జపనీయులు వస్తున్నారు... ఉండవల్లి గుహలు చూస్తారంటా... వారికి చరిత్ర వివరించాలంటా... భారీ సంఖ్యలో వచ్చేవారికి అతిథి మర్యాదలు చేయాలంటా.. అంటూ జిల్లా కలెక్టర్‌తో మొదలుకుని ఇతర అధికారులంతా బుధవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని అనంత పద్మనాభ స్వామి గుహల వద్ద హడావుడి చేశారు. మండలంలోని ఉండవల్లి వద్ద గుహలను చూడడానికి జపాన్ బృందం వస్తుందంటూ జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించడంతో అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఆర్డీవో భాస్కర్ నాయుడు నేతృత్వంలో అధికార గణమంతా జపాన్  బృందానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. పురావస్తు శాఖలో పనిచేసిన విశ్రాంత అధికారులను సైతం జపాన్ బృందానికి చరిత్రను వివరించేందుకు సన్నద్ధం చేశారు.
 
 జిల్లా కలెక్టర్ కూడా అక్కడకు చేరుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు. ఇంతలోనే 64 మంది సభ్యులున్న జపాన్ బృందం  రావడం లేదని క బురు అందించారు. దీంతో ఏర్పాట్లు చేసిన అధికారులు కలెక్టర్‌తో కలిసి వెనుదిరి గారు. తాడేపల్లి తహశీల్దార్ ఎంటీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ కల్టెకర్ సతీష్, పురావస్తు శాఖ రిటైర్డు అధికారులు కోటేశ్వరరావు, జయప్రద, వీఆర్వోలు వర్మ, శ్రీనివాసరావు, ఎస్‌ఐ బుజ్జిబాబు, పోలీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement