బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణారావు బుధవారం గవర్నర్ ను కలిశారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్, బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన అభ్యంతకర పోస్టులపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్‌లో ఐవైఆర్ షేర్ చేసిన పోస్ట్‌లు, తదనంతర పరిణామాలపై కూడా ఆయన..గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లారు. కృష్ణారావును బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తొలగించడంపై ఇప్పటికే పలు బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.