విశాఖ, విజయవాడ, కాకినాడ, అనంతలో ఐటీ సంస్థలు | IT companies to visakhapatnam, vijayawada, kakinada, Anantapur | Sakshi
Sakshi News home page

విశాఖ, విజయవాడ, కాకినాడ, అనంతలో ఐటీ సంస్థలు

Jul 2 2014 2:45 PM | Updated on Sep 27 2018 3:58 PM

విశాఖ, విజయవాడ, కాకినాడ, అనంతలో ఐటీ సంస్థలు - Sakshi

విశాఖ, విజయవాడ, కాకినాడ, అనంతలో ఐటీ సంస్థలు

విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ , అనంతపురంలలో ఐటి సంస్థలను ఏర్పాట్టు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ , అనంతపురంలలో ఐటి సంస్థలను ఏర్పాట్టు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. అనంతపురం రైతు బజార్లో 30 రూపాయిలకు కిలో బియ్యం పథకాన్ని మంత్రి పరిటాల సునీతతో కలసి రఘునాథ రెడ్డి ప్రారంభించారు. రైతు బజార్‌ వద్ద ఉన్న మద్యం షాపులు తొలగించి, నిత్యావసర వస్తువులన్నీ రైతు బజార్‌లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామని   సునిత చెప్పారు.

పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని రఘునాథరెడ్డి హామీ ఇచ్చారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదా సదుపాయాలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement