మందలించారని విద్యార్థిని ఆత్మహత్య | Intermediate student commits suicide | Sakshi
Sakshi News home page

మందలించారని విద్యార్థిని ఆత్మహత్య

Nov 3 2015 2:43 PM | Updated on Nov 6 2018 7:56 PM

తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

నాయుడుపేట (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా) : తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నాయుడుపేట మండలం శ్రీనివాసపురంలో మంగళవారం చోటుచేసుకుంది. మర్లపల్లి గ్రామానికి చెందిన గీత(17) అనే విద్యార్థిని శ్రీనివాసపురం రైల్వేట్రాక్‌పై పడుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లిదండ్రులు ఆమెను ఎందుకు మందలించారనే విషయం తెలియాల్సి ఉంది. కాగా పోలీసులు రాకముందే తల్లిదండ్రులు యువతి మృతదేహాన్ని సంఘటనాస్థలం నుంచి తీసుకువెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement