కళాశాలకు వెళ్లలేదని తల్లిదండ్రులు మందలించటంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది.
మదనపల్లె (చిత్తూరు) : కళాశాలకు వెళ్లలేదని తల్లిదండ్రులు మందలించటంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం... మదనపల్లె మండలం నక్కలదిన్నె తండాకు చెందిన వెంకటరమణ, భాగ్యమ్మ దంపతుల కుమార్తె దివ్యవాణి(17) మదనపల్లెలోని భారతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది.
అయితే సోమవారం ఆమె కాలేజీకి వెళ్లలేదు. దీంతో తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. మనస్తాపానికి గురైన దివ్యవాణి ఇంట్లోని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2.45 గంటలకు మృతిచెందింది.