దంపతుల అనుమానాస్పద మృతి | husband and wife Suspicious death | Sakshi
Sakshi News home page

దంపతుల అనుమానాస్పద మృతి

Mar 16 2014 3:18 AM | Updated on Aug 24 2018 2:33 PM

దంపతుల అనుమానాస్పద మృతి - Sakshi

దంపతుల అనుమానాస్పద మృతి

లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నబజార్‌లో భార్యాభర్తలు శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితి లో మృతిచెందారు. ఈ ఘటన శని వా రం గుంటూరులో కలకలం రేపింది.

 గుంటూరు ఈస్ట్, న్యూస్‌లైన్
 లాలాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నబజార్‌లో భార్యాభర్తలు శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితి లో మృతిచెందారు. ఈ ఘటన శని వా రం గుంటూరులో కలకలం రేపింది. భర్త రాసిన సూసైడ్ నోట్‌ను బట్టి .. భార్యపై అనుమానం పెంచుకుని భర్త ఆమెను హత్య చేసి అనంత రం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

ప్రాథమిక సమాచారాన్ని బట్టి పోలీసులు రెండు కోణా ల్లో విచారణ చేపట్టారు. లాలాపేట ఎస్‌హెచ్‌వో వినయ్‌కుమార్ కథనం మేర కు.. పెదకూరపాడు మండలం హుస్సేన్‌నగర్‌కు చెందిన కుంచెనపల్లి శ్రీనివాసరావు(32)కు గుంటూరు చౌత్రాసెంట ర్‌కు చెందిన చింతా లక్ష్మి(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. స్థాని కంగా చిల్లరకొట్టు నడిపే శ్రీనివాసరావు గుంటూరులో ఉంటున్న అత్త విజయకుమారి సహా యంతో లాలాపేట పరిధిలోని చిన్నబజారు, ముఫ్తీ వీధిలో అద్దె ఇంట్లో చిల్లరకొట్టు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నాడు.

 

వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. వారికి కుమార్తెలు తేజ (7), చందన (5), కుమారుడు ప్రసన్న కుమార్ (2) ఉన్నారు. ఏడాది కాలం గా చిల్లరకొట్టు ఎదురు గట్లపై ఐదుగు రు వ్యక్తులు కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఒకరితో తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానాన్ని శ్రీనివాసరావు పెంచుకున్నాడు. పలుమార్లు గొడవలు చోటుచేసుకున్నాయి. ఇదే విషయాన్ని అత్త దృష్టికి తీసుకువెళ్లాడు. ఈక్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఒం టిగంటకు పిల్లలు, భార్య నిద్రిస్తుం డగా.. శ్రీనివాసరావు భార్య మెడకు టవల్ బిగించివేయడంతో దంపతుల మధ్య పెనుగులాట జరిగింది.

 

భార్య మృతిచెందడంతో శ్రీనివాసరావు కూ డా ఫ్యాన్ కొక్కానికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిద్రలేచిన పెద్దకుమార్తె తేజ తల్లిదండ్రుల పరిస్థితి చూసి భయభ్రాంతులకు లోనైంది. పక్కింటివారికి చెప్పడంతో వారి సమాచారం మేరకు మృ తురాలి అన్న వెంకన్న పోలీసులకు తెలిపాడు.

 

ఈస్ట్ డీఎస్పీ గంగాధర్, లాలాపేట ఎస్‌హెచ్‌వో వినయ్‌కుమార్, క్లూస్ బృందం ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించా రు. మృతదేహాల వద్ద ఓ కవర్‌లో సూసైడ్ నోట్, జిరాక్స్ కాపీలను స్వా ధీనం చేసుకున్నారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. సూసైడ్ నోట్ ఆధారంగా భార్యను హత్య చేసి, శ్రీనివాసరావు ఆత్మహత్య చేసుకున్న ట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. తల్లిదండ్రుల మృతదేహాలను చూసి ముగ్గురు పిల్లలు భోరున విలపిం చారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
 

రాజకీయ నాయకుల రంగప్రవేశం!
 అనుమానితులైన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న కొద్దిగంటలకే ఇద్దరు బడారాజకీయ నాయకులు అనుచరులతో కలిసి పోలీసుస్టేషన్‌కు వచ్చినట్లు తెలిసింది. తమకు అనుకూలంగా కేసు పెట్టేవిధంగా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. శ్రీనివాసరావు భార్యను హత్యచేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడన్న అంశంపైనే కేసు పెట్టాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement