: హుదూద్ పెను తుపాన్ మరికొన్ని గంటల్లో బలహీనపడనుందని ఐఎండీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్: హుదూద్ పెను తుపాన్ మరికొన్ని గంటల్లో బలహీనపడనుందని ఐఎండీ అధికారులు తెలిపారు. తుపాన్ బలహీనపడ్డాక అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. గాలుల తీవ్రత కొన్ని గంటల్లో తగ్గుతుందని భావిస్తున్నారు.
హుదూద్ పెను తుపాన్ పూడిమడక వద్ద తీరాన్ని దాటింది. ఆదివారం ఉదయం విశాఖపట్నం జిల్లా కైలాసగిరి వద్ద తీరం తాకిన తుపాన్ 12 గంటల ప్రాంతంలో తీరం దాటింది. తుపాన్ ప్రభావం సాయంత్రం వరకు ఉంటుంది.