తాడేపల్లిలో ఉద్రిక్తత | High Tension At Tadepalli | Sakshi
Sakshi News home page

తాడేపల్లిలో ఉద్రిక్తత

May 25 2018 9:15 AM | Updated on Oct 1 2018 2:19 PM

High Tension At Tadepalli - Sakshi

అమరావతి : గుంటూరు జిల్లా తాడేపల్లిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పేరుతో పొలాల్ని కొలతలు వేయడానికి రెవన్యూ అధికారులు భారీ స్థాయిలో పోలీస్‌ ఫోర్స్‌తో వచ్చారు. అయితే విషయం తెలుసుకున్న రైతులు పొలాలకు చేరుకొని కొలతలు వేయకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. భూసేకరణ చట్టం ప్రకారం పొలాలను కొలతలు వేసే అధికారం అధికారులకు లేదన్నారు. చట్ట ప్రకారం నోటీసులు ఇవ్వకుండా ఎలా కొలతలు చేపడతారని రైతులు అధికారులను నిలదీశారు.

Advertisement
 
Advertisement
Advertisement