జిల్లాలో టాపర్లు వీరే

Grama Sachivalayam Toppers In Nellore - Sakshi

సచివాలయాల రాత పరీక్ష ఫలితాల విడుదల

21 నుంచి కాల్‌లెటర్స్‌ పంపిణీ

27 నుంచి నియామక ఉత్తర్వులు

లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ కొలువుల రాత పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి గ్రామ/వార్డు సచివాలయాలు నెలవు కానున్న నేపథ్యంలో జిల్లాలో కొలువుల కోలాహలం నెలకొంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రజలకు ఇంటి ముంగిటకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నవరత్నాల అమలుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు చేరేందుకు ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

నెల్లూరు(అర్బన్‌): జిల్లాలో 940 పంచాయతీలకు 665 సచివాలయ భవనాలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 10,300 కొత్త కొలువులు రానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి పారదర్శకంగా ఈ నెల 1 నుంచి 8వ వరకు కేవలం మెరిట్‌ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించారు. ఇందుకు 1,29,860 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,17,138 మంది పరీక్షలు రాశారు. 19 రకాల పోస్టులను భర్తీ చేసేందుకు 14 రకాల పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. పరీక్షల ఓఎంఆర్‌ షీట్లను 3వ తేదీ నుంచి మొదలు పెట్టి 9వ తేదీ వరకు రికార్డు స్థాయిలో స్కానింగ్‌ చేశారు. అతి తక్కువ సమయంలో ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా ఫలితాలను గురువారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

జిల్లా టాపర్లు వీరే..

హాల్‌ టికెట్‌ నంబరు పేరు మార్కులు పోస్టుపేరు
190904003189 పొట్టేళ్ల సురేష్‌ 114.75 కేటగిరీ–2 గ్రూప్‌ ఏ
190905004464 సున్నపు రవి 114.25 కేటగిరీ–2 గ్రూపు–బీ
190905004012 బెల్లం సాంబశివరెడ్డి 113.25 కేటగిరీ–2 గ్రూపు–బీ
190904003218 కుడుమల సందీప్‌ 110.5 కేటగిరీ–2 గ్రూపు–ఏ
190905000617 పప్పిశెట్టి నిఖిల్‌ 110 కేటగిరీ–2 గ్రూపు–బీ
190904005553 కండే మాధురి 106.5 కేటగిరీ–2 గ్రూపు–ఏ
190901060478 బి. లక్ష్మీమౌనిక 101.75 కేటగిరీ–1
191005001773 బొమ్మన పూజిత 100.75 కేటగిరీ–2 గ్రూపు–బీ
191301043962 గాజులపల్లి శ్రీలేఖ 100 కేటగిరీ–1
191004002956 ఎస్‌.విజయలక్ష్మి 99.75 కేటగిరీ–2 గ్రూపు– ఏ

శరవేగంగా నియామకాల ప్రక్రియ 
పరీక్ష ఫలితాలను గ్రామ సచివాలయం/ఆర్‌టీజీఎస్‌ వెబ్‌ సైట్‌లో అభ్యర్థి హాల్‌ టికెట్లు నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా తెలుసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. తర్వాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలిపిన తేదీల్లో నిర్ణీత ప్రదేశాల్లో వారి సర్టిఫికెట్‌లను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్‌లను వెబ్‌సైట్‌లో ఈ నెల 21వ తేదీ నుంచి అప్‌లోడ్‌ చేయాలి. 21వ తేదీ, 22వ తేదీల్లో అభ్యర్థులకు కాల్‌లెటర్లు పంపిణీ చేస్తారు. సర్టిఫికెట్స్‌ పరిశీలన అనంతరం 27వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top