యువతను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం | Government to Dispose of youth says ponguleti srinivas reddy | Sakshi
Sakshi News home page

యువతను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

Dec 9 2013 6:14 AM | Updated on Aug 21 2018 5:36 PM

ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

ఖమ్మం అర్బన్,న్యూస్‌లైన్: ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో నగరంలోని 5వ డివిజన్ నుంచి సుమారు 50 మంది యువకులు పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలు బాణోతు శారదా ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిరణ్ సర్కార్ యువత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. యువత చైతన్యవంతమై ప్రభుత్వంపై ఉద్యమించాలన్నారు.   కార్యక్రమంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు హెచ్. వెంకటేశ్వర్లు, పార్టీ రఘునాధపాలెం మండల కన్వీనర్ దుంపటి నగేష్, నగర ట్రేడ్ యూనియన్ కన్వీనర్ పత్తి శ్రీను, ఎం.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.  పార్టీలో చేరిన వారిలో జి.జగదీష్, ఎం.అబిషేక్, ఎస్. వెంకటనారాయణ, పి.శ్యాంబాబు, రాంకుమార్, సాయి, నిఖిల్, రాకేష్, నీరేష్, నాగరాజు, మదార్‌సాహెబ్, రామకృష్ణ,రాధాకృష్ణ,కృపాకర్, ఉదయ్ శ్యామ్ ఉన్నారు.
 
 మురికి కూపాలుగా విలీన పంచాయతీలు
 కార్పొరేషన్‌లో విలీనం చేసిన పంచాయతీలను మురికి కూపాలుగా మార్చారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగర శివారులోని  కొత్తగూడెం, అల్లీపురంలోని 10వడివిజన్ పరిధిలోని పార్టీ ముఖ్యలు, సానుభూతిపరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు స్థానిక సమస్యలపై పొంగులేటి వద్ద ఏకరవు పెట్టారు. కార్పొరేషన్‌గా మార్చిన తర్వాత లైట్లు వెలుగులులేవని, తాగు నీరు సక్రంగా రావడం లేదని, సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వీవీపాలెం సొసైటీ డెరైక్టర్ బొమ్మిశెట్టి సత్యనారాయణ, వినగల నాగేశ్వరరావు,  వడ్డెబోయిన మల్లేష్, పొదిల ఆదినారయణ, చిలకల వెంకటనారాయణ, కర్రి ముత్తయ్య, గద్దెల నాగేశ్వరరావు, పత్తిపాటి వీరు, మాజీ సర్పంచ్ సంజవరావు, అమడాల ఉపేందర్, చల్లగుండ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 
 చందా కుటుంబానికి పరామర్శ
 రఘునాధపాలెం: ఇటీవల మృతిచెందిన పార్టీ చింతగుర్తి గ్రామ కన్వీనర్ మాలోత్ చందా కుటుంబాన్ని ఆదివారం పొంగులేటి పరామర్శించారు. గత సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థిని గెలిపించుకోవడంలో చందా కృషి చేశారని కొనియాడారు. చందా కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో చింతగుర్తి సర్పంచ్ తమ్మిన్ని నాగేశ్వరరావు, మండల కన్వీనర్ దుంపటి నగేష్, నాయకులు కీసర విష్ణువర్థన్‌రెడ్డి,సుతగాని గోపి, జీడిమెట్ల సంగయ్య, వెంకన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement