ఆదర్శం అమరాంజనేయులు | Government TeacherJoins In Govt School In Anantapur | Sakshi
Sakshi News home page

ఆదర్శం అమరాంజనేయులు

Jun 28 2018 11:27 AM | Updated on Jul 26 2019 6:25 PM

Government TeacherJoins In Govt School In Anantapur - Sakshi

వేపలపర్తి ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న వాసన్‌ చెర్రీ (ఇద్దరు పిల్లలమధ్య పచ్చ గళ్ల చొక్కా బాబు)

బ్రహ్మసముద్రం: కార్పొరేట్‌ పాఠశాలలో ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్నా...తన కుమారుడిని మాత్రం ప్రభుత్వం పాఠశాలలోనే చేర్పించాడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సర్కార్‌ స్కూళ్లపై నమ్మకం కల్గించాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దపప్పూరు మండలంలోని ఆమళ్ళదిన్నె గ్రామానికి చెందిన నల్లప్ప, పుల్లమ్మలకు ముగ్గురు కుమారులు సంతానం. వారిలో అమరాంజనేయులు కూడా ఒకరు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలో చదివి ఎంపీఈడీ పూర్తి చేశారు.

2014 డీఎస్సీలో పీఈటీగా ఎంపికై గుండిగానపల్లిలో ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. ఆక్రమంలనే తన అన్నావదినలు అనారోగ్యంతో మృతి చెందగా వారి కుమారుడు వాసన్‌ చెర్రీని దత్తత తీసుకున్నాడు. తనలాగే తన బిడ్డ వృద్ధిలోకి రావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివించడమొక్కటే మార్గమనుకున్నాడు. వెంటనే వేపలపర్తి ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతిలో చేర్చించాడు. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉంటారని... విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని... అందువల్లే తన కుమారుడు వాసన్‌ చెర్రీని  ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానని అమరాంజనేయులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement