పాఠశాలల్లో సదుపాయాలపై సుప్రీం ఆరా | government schools Supreme Court Lawyers Observed in Vizianagaram | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో సదుపాయాలపై సుప్రీం ఆరా

Aug 24 2014 1:44 AM | Updated on Sep 2 2018 5:20 PM

పాఠశాలల్లో సదుపాయాలపై  సుప్రీం ఆరా - Sakshi

పాఠశాలల్లో సదుపాయాలపై సుప్రీం ఆరా

ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదుల త్రిసభ్య బృందం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఆకస్మికంగా పర్యటించింది.

విజయనగరం అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదుల త్రిసభ్య బృందం జిల్లాలోని పలు మండలాల్లో శనివారం ఆకస్మికంగా పర్యటించింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిస్థితి, వాటికి రన్నింగ్ వాటర్, తాగునీటి సదుపాయాలపై సంబంధిత ప్రధానోపాధ్యాయులను అడగడమే కాకుండా స్వయంగా పరిశీలించింది. శనివారం ఉదయం జిల్లాకు చేరుకున్న బృందంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్‌కుమార్ గుప్త నేతృత్వంలో న్యాయవాదులు టి.వి. రత్నం, జి. వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. ముందుగా డెంకాడ మండలం జొన్నాడ ఉన్నత పాఠశాలకు చేరుకుని పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించారు. మరుగుదొడ్లకు అవసరమైన నీటి సదుపాయం ఉందో లేదో చూశారు.
 
 అలాగే తాగునీటి వనరులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన వంటల రుచి, నాణ్యతను చూశారు. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పరిశీలన జరుగుతోందన్నారు. పరిశీలనలో సేకరించి న వివరాలతో నివేదికలను సుప్రీం కోర్టుకు అందజేస్తామని తెలిపారు.  తాము తయారు చేసుకున్న రూట్ మ్యాప్ ఆధారంగా అక్కడ నుంచిపర్యటన కొనసాగించారు. డెంకాడ మండలంలోని చినఅమకాం, రాజుల తమ్మాపు రం, బొడ్డుపాలెం,పినతాడివాడ, ఊడికల పేట, జమ్ము తదితర పాఠశాలలను పరిశీ లించారు. అనంతరం జెడ్పీ అతిథి గృహానికి చేరుకున్న బృందాన్ని కలెక్టర్  నాయక్ మ ర్యాదపూర్వకంగా కలిశారు.

 మధ్యాహ్నం పర్యటనలో విజయనగరం డివిజన్‌లోని గం ట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెం టాడ మండలాలతో పాటు పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి, రామభద్రపురం మండలాలకు చెందిన  పాఠశాలల్లోని వసతులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 పాఠశాలలను పరిశీలించింది. విద్యాశాఖ సంయుక్త సంచాలకులు ఎం.ఆర్.ప్రసన్నకుమార్, ఆర్‌వీఎం రాష్ట్ర ఈఈ సుధీర్‌బాబు, డీఈఓ జి.కృష్ణారావు, ఆర్‌వీఎం పీఓ శారద, ఉప విద్యాశాఖ అధికారులు నాగమణి, సత్యనారాయణ, డీపీఓ బి.మోహనరావు  పర్యటనలో పాల్గొన్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement