నేటి నుంచి ‘పరిషత్’ నామినేషన్లు | From the 'upper' nominations | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘పరిషత్’ నామినేషన్లు

Mar 17 2014 1:06 AM | Updated on Sep 2 2017 4:47 AM

జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్లు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతంగా...

విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్లు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయని, ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంతంగా ని ర్వహించాలని కలెక్టర్ సాల్మన్‌ఆరోఖ్యరాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకాధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
 
 ఈ నెల 17 నుంచి 20 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వ రకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.
 
జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు జిల్లా పరిషత్ కార్యాలయంలో ముఖ్యకార్యనిర్వహణాధికారికి, అదే విధంగా ఎంపీటీసీ అభ్యర్థులు మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్లు సమర్పించాలి.
 
 ‘పరిషత్’లతో పాటు, మున్సిపల్, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అధిక ఒత్తిడికి గురవుతున్నారని, అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ బాధ్యతగా చేయాల్సిన అవసరముందని చెప్పారు.
 
నామినేషన్లు అనంతరం వాటి పరిశీలన, గుర్తుల కేటాయింపులకు ఎన్నికల నియమావళిని అనుసరించాలని ఆదేశించారు.
 
 ప్రతీ మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు, సెక్టోరల్ ఆఫీసర్లు, వీడియో బృందాలు ఎప్పటికప్పుడు పర్యటించి నివేదికలను పంపించాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement