బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు లేచే సరికి భయంతో ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు.
పుట్లూరు (అనంతపురం): బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు లేచే సరికి భయంతో ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చెర్లోపల్లి వద్ద సోమవారం సాయంత్రం జరిగింది. తాడిపత్రి డిపోకు చెందిన బస్సు తాడిపత్రి వైపు వెళుతుండగా బస్సు లోపలి వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు లేచినట్టు తెలుస్తోంది. డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేయగా స్థానికులు మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు.