సీమాంధ్రకు చిల్లే!

సీమాంధ్రకు చిల్లే! - Sakshi


 విభజనతో ఆదాయుంలో కోత.. వ్యయం మాత్రం మోత

 హైదరాబాద్ ఆదాయుంలో వాటాకు కేంద్రం నో

 పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడే సూచనా తిరస్కృతి

 విడిపోతే జీతాలు, పెన్షన్లకూ తీవ్ర కటకట తప్పదు

 రాష్ట్ర ఆదాయంలో సీమాంధ్రకు దక్కేది 44%

 ఖర్చులు, అప్పులపై వడ్డీల వ్యయమేమో 60%


 

 సాక్షి, హైదరాబాద్:

 

 రాష్ట్ర విభజన అనివార్య మైతే... కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ (సీవూంధ్ర) రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక ఇక్కట్లు చుట్టువుుట్టనున్నారుు! చివరకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు, రోజువారీ ప్రభుత్వ ఖర్చులకూ కటకటలాడాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ఈ సవుస్యలన్నీ ప్రస్తావిస్తూ, సీవూంధ్ర భవిష్యత్తు కష్టాలు తీర్చటానికి ఉద్దేశించి సీవూంధ్ర ప్రతినిధులు.. విభజన బిల్లుకు పలు సవరణలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించినా కేంద్ర కేబినెట్ బేఖాతరు చేసింది. తన పాత వైఖరికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర విభజన అనంతరం సీవూంధ్ర తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రవూదం కనిపిస్తోంది. ప్రత్యేకించి సీవూంధ్ర ఆదాయుం పెరిగేందుకు వీలుగా ప్రత్యేక సాయూన్ని అందించాలనే కోరికలనూ, కొద్ది సంవత్సరాల పాటు పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడే (పన్నులకు విరామం) ప్రకటించాలనే విజ్ఞప్తులనూ, అభివృద్ధి కేంద్రీకృతమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఆదాయుంలో వాటా ఇవ్వాలనే విన్నపాలనూ, చివరకు కొత్త రాజధాని నిర్మాణానికి నిర్దుష్టమైన ప్యాకేజీని వుుందే ప్రకటించాలనే డివూండ్‌నూ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది!

 ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే సొంత ఆదాయుమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆదాయుం నుంచి వాటా, గ్రాంట్లు సవుకూరుతుంటారుు. ఆ లెక్కలివీ...

 

  రాష్ట్ర సొంత ఆదాయుం..: 2012-13 సంవత్సరాన్ని పరిశీలిస్తే.. వ్యాట్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, గనులు తదితర రంగాల ద్వారా రాష్ట్ర సొంత ఆదాయం రూ. 68,411 కోట్లు. ఇందులో తెలంగాణ ప్రాంతం నుంచి రూ. 40,919 కోట్లు రాగా, సీవూంధ్ర ప్రాంతం నుంచి రూ. 27,492 కోట్లు వచ్చారుు. అంటే సీవూంధ్ర నుంచి సవుకూరిన ఆదాయుం కేవలం 44 శాతమే. రాష్ట్ర విభజన అనంతరవుూ ఇదే ధోరణి కనిపించే  వీలుంది.

 

  కేంద్రం ఇచ్చే నిధులు..: కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటా, కేంద్ర గ్రాంట్లు కలిపి 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి మొత్తం రూ. 34,064 కోట్లు వస్తున్నారుు. జనాభా నిష్పత్తి, విస్తీర్ణం, పథకాల అవులు, వూనవ వనరుల సూచిక, ప్రగతి అంచనాలను పరిగణనలోకి తీసుకుని ఏ ప్రాంతానికి ఎంత వాటా ఇవ్వాలో లెక్కిస్తారు. ప్రాంతాల వారీగా లెక్క తీస్తే తెలంగాణ ప్రాంతానికి రూ. 16,384 కోట్లు, సీవూంధ్ర ప్రాంతానికి రూ. 17,680 కోట్ల మేరకు కేంద్రం నుంచి వస్తున్నట్లు ఆర్థిక నిపుణులు లెక్కలేశారు.

 

  స్థూల ఆదాయుం లెక్క..: రాష్ట్ర ఆదాయుం, కేంద్రం నుంచి అందే గ్రాంట్లు, వాటాలు కలిపి మొత్తం రూ. 1,02,475 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సీమాంధ్రకు రూ. 45,172 కోట్లు అంటే 44 శాతం.. తెలంగాణకు రూ. 57,303 కోట్లు అంటే 56 శాతం ఆదాయం సవుకూరింది. మొత్తం మీద స్థూలంగా చూస్తే విభజన తర్వాత     సీమాంధ్ర ప్రాంత ఆదాయం 44 శాతం మాత్రమే!

 

 వ్యయుం తీరు పూర్తిగా భిన్నం!

  ప్రస్తుతం జిల్లాల వారీగా జరుగుతున్న వ్యయూన్ని లెక్కిస్తే 56.1 శాతం రెవెన్యూ వ్యయం సీమాంధ్ర జిల్లాలో ఉంది. దీంట్లోనే జీతాలు, పెన్షన్లు, సంక్షేవు పథకాలు, అభివృద్ధి పనులకు పెట్టే ఖర్చు కలిసి ఉంటుంది. ఈ వ్యయూనికి అదనంగా రుణాలపై వడ్డీలను కూడా కలిపితే 60 శాతానికి సీమాంధ్ర ప్రభుత్వ వ్యయం చేరుతుంది. అంటే.. 44 శాతం ఆదాయూనికి 60 శాతం వ్యయుం ఉండబోతున్నదన్నవూట! ఈ 16 శాతం మేరకున్న లోటు రాబోయే కాలంలో సీమాంధ్ర ప్రభుత్వానికి తీవ్రంగా ఆర్థిక కష్టాలను తీసుకురానుంది.

 - సీవూంధ్రలో వ్యయుం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఒక ఉదాహరణ.. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల సంఖ్య 44.2 శాతం ఉండగా.. సీవూంధ్రలో వూత్రం 55.8 శాతం! అలాగే తెలంగాణ ప్రాంత పెన్షనర్ల సంఖ్య 41.3 శాతం ఉండగా.. సీవూంధ్రలో 58.7 శాతం. అంటే సీవూంధ్ర కొత్త ప్రభుత్వం ఈమేరకు ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లపై భారీగా ఖర్చు చేయూల్సి ఉంటుంది.

 

 రాజధాని ఆదాయుమే కీలకం!




 

 ఐటీ సేవలు, పరిశ్ర వులు, ఎక్సరుుజు, ఫార్మా, ప్రైవేటు వైద్యం, ఇతర సేవారంగాలు, కార్పొరేటు కంపెనీల కార్యాలయూలు కేంద్రీకృతమైన రాజధాని నగరం హైదరాబాద్ నుంచే రాష్ట్రానికి అత్యధికంగా ఆదాయుం సవుకూరుతుంది. ఉదాహరణకు.. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ఆదాయుం హైదరాబాద్‌లోనే 76 శాతం (రూ. 31,943 కోట్లు) రాగా.. సీమాంధ్రలో 16 శాతం (రూ. 6,684 కోట్లు), మిగతా తెలంగాణ జిల్లాల్లో 8 శాతం (రూ. 3,433 కోట్లు) వచ్చింది. ఇలా రాష్ట్ర సొంత ఆదాయుం ప్రధానంగా హైదరాబాద్‌పై కేంద్రీకృతమై ఉండగా.. రాజధాని ఆదాయుంలో సీవూంధ్ర రాష్ట్రానికి సవుంజసమైన వాటా పంపిణీ చేయూలనే సీవూంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, ఆర్థిక నిపుణుల సూచనలను కేంద్ర కేబినెట్ తిరస్కరించింది. కీలకమైన రాజధాని ఆదాయుంలో వాటా కోల్పోవడం వల్ల సీవూంధ్ర ఆదాయూనికి భారీగా గండిపడనుంది. తద్వారా కొత్త రాజధాని నిర్మాణం, వలిక వసతుల కల్పన వంటి ప్రణాళికా వ్యయూనికి సైతం తీవ్రంగా నిధుల కొరత అనివార్యం కానుంది. ఐతే రాజధాని నిర్మాణానికి కానీ, ఇతర వలిక వసతుల కల్పనకు కానీ కేంద్ర కేబినెట్ నిర్దుష్టంగా ఏ హామీ ఇవ్వకపోవటం గవునార్హం!

 

 అడిగనవేమీ ఇవ్వకుండానే...

 

 విభజన నేపధ్యంలో సీమాంధ్రకు ఆర్థిక లోటు రాకుండా హైదరాబాద్ ఆదాయంలో సమంజసమైన వాటా ఇవ్వాలనే సూచనను నిర్ద్వంద్వంగా తిరస్కరించిన కేంద్రప్రభుత్వం.. సీమాంద్రకు తగిన సాయం చేస్తామని హామీ ఇచ్చింది కానీ.. ఎంత మొత్తం, ఏ రూపంలో ఇస్తారో చెప్పాలనే డిమాండ్‌ను మాత్రం పట్టించుకోలేదు...

 

 1. రాజధాని నిర్మాణానికి నిధుల మంజూరుపై అస్పష్టత

 

 బిల్లులో ఉన్నది: నూతన రాజధానిలో నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

 కోరిన సవరణ: నిధులిస్తామని చెప్తే సరిపోదు. కొత్త రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2 లక్షల కోట్లు అవసరం. ఈ మేరకు నిధుల మంజూరుకు కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలి.

 జీవోఎం ఏం చెప్పిందంటే: ఎంత మొత్తం అవసరమనే అంశం నిర్ధారించడం ఈ దశలో సాధ్యం కాదు. అందువల్ల తిరస్కరిస్తున్నాం.

 

 2. పదమూడో ఆర్థిక సంఘం నిధుల పంపిణీ

 

 బిల్లులో ఉన్నది: 13వ ఆర్థిక సంఘం నిధులను రెండు రాష్ట్రాలకు జనాభా, ఇతర అంశాల ఆధారంగా పంపిణీ. సీమాంధ్ర ఆదాయాన్ని పరిశీలించిన తర్వాత.. కేంద్రం తగిన సహాయం (గ్రాంట్లు) ఇస్తుంది.

 కోరిన సవరణ: హైదరాబాద్ ఆదాయాన్ని 10 సంవత్సరాల పాటు ఇరు రాష్ట్రాలకు పంచాలి. పంపిణీ తీరును నిర్ధారించడానికి కమిషన్ ఏర్పాటు చేయాలి. కేంద్ర సాయాన్ని రెండు రాష్ట్రాలకు పంచాలి. అదనంగా సీమాంధ్రకు అందించే సాయాన్ని ముందుగా ప్రకటించాలి. ఏఏ పథకాల కింద సాయం అందిస్తారనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి.

 జీవోఎం ఏం చెప్పిందంటే: అంగీకరించలేదు.

 

 3. ఆస్తులు, అప్పుల పంపిణీ

 

 బిల్లులో ఉన్నది: రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరుగుతుంది.

 కోరిన సవరణ: నిర్ధారిత ప్రాజెక్టుల వారీ ఆదాయ, వ్యయాలను పరిశీలించిన తర్వాతే హేతుబద్ధంగా పంపిణీ జరగాలి. 14వ ఆర్థిక సంఘం నివేదిక సమర్పించే ముందే.. తెలంగాణలో పర్యటించాలి.

 జీవోఎం ఏం చెప్పిందంటే: ప్రాజెక్టుల ఆధారంగా ఆస్తుల, అప్పుల పంపిణీ చేయటం సాధ్యం కాదు. 14న ఆర్థిక సంఘం విధివిధానాలను జీవోఎం నిర్ణయించజాలదు.



 ఆదాయం లేదు.. ప్రోత్సాహం లేదు..!

 

 సీమాంధ్రలో ట్యాక్స్ హాలిడే విజ్ఞప్తులను తోసిపుచ్చిన కేంద్రం

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అంకం క్లైమాక్స్‌కు చేరింది. కేబినెట్ ఆమోద ముద్ర పడ్డ బిల్లు నేడో, రేపో పార్లమెంటులో అడుగుపెట్టబోతోంది. కానీ.. విభజన ద్వారా ఆర్థికంగా పలు నష్టాలను ఎదుర్కోబోతున్న సీమాంధ్ర ప్రాంతాన్ని ఆదుకునేందుకు నిర్దిష్ట హామీలేవీ బిల్లులో లేకపోవడంపై ఆర్థికవేత్తలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల విభజనతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ విభజనకు కొన్ని ప్రత్యేకమైన చిక్కులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు ఎక్కువగా కేంద్రీకృతమైన రాజధానిని, అక్కడి నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితి ఉండటం దీనికి కారణం. ఈ నష్టాన్ని పూడ్చేందుకు వివిధ వర్గాల నుంచి సూచనలు వచ్చినప్పటికీ.. కేబినెట్ ఆ అంశాలను పూర్తిగా పెడచెవిన పెట్టింది.

 

  సీమాంధ్ర ప్రాంతం (విభజన తరువాత ఆంధ్రప్రదేశ్)లో పారిశ్రామిక, ఐటీ సంబంధిత మౌలిక సదుపాయాలు ఏమాత్రం లేవన్న విషయాన్ని కేబినెట్ గుర్తించలేదు. భవిష్యత్తులో సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా కేంద్రం అందుకు తగిన ఆర్థిక సాయం చేయాలి. ఆర్థికసాయుం చేయూలనే ప్రతిపాదనలపై కేంద్ర కేబినెట్ కివ్మునకుండా, నిర్దుష్టంగా సాయుం పరివూణం ఏమిటో చెప్పకుండా కేవలం ఆర్థికసాయుం చేస్తావుని పేర్కొని దాటవేసే ప్రయుత్నం చేసింది.

 

  రాష్ట్రం మొత్తమ్మీద ఐటీ రంగం లావాదేవీల మొత్తం రూ. 55 వేల కోట్లు ఉంటే.. ఇందులో రూ. 54 వేల కోట్ల పైచిలుకు కేవలం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఏతావాతా విశాఖపట్నం మినహా సాఫ్ట్‌వేర్ రంగం అంతా హైదరాబాద్‌లోనే ఉందన్నవూట.

 

  ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ వంటి పర్వతప్రాంత రాష్ట్రాలకు ఇచ్చినట్లే పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం ద్వారా విభజన నష్టాలను కొంతవరకైనా పూడ్చుకోవచ్చునన్న ప్రతిపాదనలను కూడా కేబినెట్ బేఖాతరు చేసింది. ఈ రాయితీలను మొత్తం ప్రాంతానికి కాకుండా రెండు మూడు జిల్లాలకు మాత్రమే పరిమితం చేసినా ఫర్వాలేదని, కాకపోతే మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ పరిశ్రమల నుంచి కనీసం 15 ఏళ్లపాటు కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీలతో పాటు ఇన్‌కమ్, సర్వీస్ ట్యాక్స్‌లను ఎత్తివేయాలని పలువురు జీఓఎంకు ప్రతిపాదనలు పంపారు.

 

  తమిళనాడు, వుహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రధాన పరిశ్రవులు ఆయూ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పడ్డారుు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వూత్రం దీనికి భిన్నంగా హైదరాబాద్ కేంద్రంగానే పరిశ్రవుల ఏర్పాటు జరిగింది.

 

  డీఆర్‌డీవోతో పాటు పలు రక్షణ రంగ సంస్థలు హైదరాబాద్ పరిసరాల్లోనే ఏర్పాటైన నేపథ్యంలో విభజన తరువాత సీమాంధ్ర ప్రాంతానికి నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలు తమ విస్తరణ కార్యకలాపాలు ఎక్కువగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్న సూచనలూ కేబినెట్ ముందు చెవిటివాడి ముందు శంఖమూదినట్లే అయిపోయిందని నిపుణులు అంటున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top