తూర్పు గోదావరి జిల్లా తొండంగి పోలీస్ స్టేషన్‌ను చౌడేపల్లిపేట గ్రామస్తులు మంగళవారం ముట్టడించారు.
పిఠాపురం: తూర్పు గోదావరి జిల్లా తొండంగి పోలీస్ స్టేషన్‌ను చౌడేపల్లిపేట గ్రామస్తులు మంగళవారం ముట్టడించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చౌడేపల్లిపేటకు చెందిన రైతు చందన వీరబాబును పోలీస్ వాహనం ధ్వంసం కేసులో మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు... తొండంగి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు. వీరబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తుని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విషయం తెలుసుకుని తొండంగి వెళ్లారు.