డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం పలు జిల్లాల్లో అగ్రిగోల్డ్
అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్ల డిమాండ్
సాక్షి నెట్‌వర్క్: డిపాజిట్లను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం పలు జిల్లాల్లో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు, ఖాతాదారులు నిరసన తెలిపారు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా తమకు న్యాయం చేయాలని, ఈ-ఆక్షన్ ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు చెల్లించాలని కోరారు. ఆస్తుల వేలం బాధ్యత కోర్టు ద్వారా ప్రభుత్వం తీసుకుని నిర్దిష్ట కాలపరిమితిలో వాటిని అమ్మి బాధితులకు చెల్లించాలని, బాధితులు, ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఆదుకోవాలని, బాధితుల జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచాలని డిమాండ్ చేశారు.
పలుచోట్ల రహదారులను దిగ్బంధించారు. ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జగన్నాథపురం వంతెనపై బాధితులు నిరసన తెలిపారు. విజయనగరం జిల్లాలో సీపీఐ, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాధితులు నిరసన తెలిపారు.