డైరెక్టర్‌ మేడ్‌ ఇన్‌ కమ్మపల్లి | Sakshi
Sakshi News home page

డైరెక్టర్‌ మేడ్‌ ఇన్‌ కమ్మపల్లి

Published Wed, Aug 23 2017 1:10 PM

డైరెక్టర్‌ మేడ్‌ ఇన్‌ కమ్మపల్లి - Sakshi

► ఉత్తమ డైరెక్టర్‌గా పీసీ ఆదిత్య 
► మొదటి చిత్రం.. ‘పిల్లలు కాదు పిడుగులు’ 
► ఆర్థికంగా ఆదుకున్నది ‘రుతురాగాలు’ 

వేపాడ(విజయనగరం): పీసీ ఆదిత్య.. పరిచయం అవసరం లేని సినీ డైరెక్టర్‌. ఆయనది మన విజయనగరం జిల్లా వేపాడ మండలం కుమ్మపల్లి గ్రామం. ఒక్కోమెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలో తనకంటూ స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్రా కళాకారులతో సందేశాత్మక చిత్రాల రూపకల్పనలో బిజీ అయ్యారు. ఉత్తరాంధ్రలోని అందమైన ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆయన ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. తన విద్యార్థి, ఉద్యోగ, సినీ ప్రస్థానాన్ని వివరించారు. ఆయన మాటల్లోనే... 

మాది విజయనగరం జిల్లా వేపాడ మండలం కుమ్మపల్లి. తల్లిదండ్రులు పోతుగంటి నర్సమాంబ, రామజోగారావులు. కుమ్మపల్లిలో 40 ఏళ్లపాటు కరణంగా రామజోగారావు పనిచేశారు. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ను ఆంధ్రాయూనివర్సిటీలో పూర్తిచేసాను. పాత్రికేయుడిగా పనిచేస్తుండగా జంధ్యాలతో పరిచయం ఏర్పడింది. కె.కోటపాడులో జంధ్యాల సారథ్యంలో తీసిన సినిమాలో అవకాశం వచ్చింది. ఓ వైపు పాత్రికేయునిగా, మరో వైపు సినీ పరిశ్రమలో అసిస్టెంట్‌ డైరెక్టరుగా పనిచేశాను. 1992 ఆగస్టు 29న సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌ వచ్చింది. అప్పట్లో సినీహీరో కృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆయన 2002లో నటించిన  ‘పిల్లలు కాదు పిడుగులు’ సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించాను. ఈ చిత్రానికి నంది అవార్డులు వరించాయి. కాంతారావు, పి.ఎల్‌.నారాయణ లాంటి కళాకారులతో తీసిన సినిమాకు అప్పటి ప్రభుత్వం పన్ను రాయితీ సైతం ఇచ్చింది. అప్పటి పరిస్థితుల  ప్రభావంతో గ్రామం విడిచి వెళ్లి కష్టాలు ఎదురైనా నచ్చిన రంగంలో లక్ష్యాన్ని చేరుకోవడం ఆనందంగా ఉంది.
 
రుతురాగాలు ఆదుకుంది.. 
1999లో బుతురాగాలు సీరియల్‌కు డైరెక్టరుగా వ్యవహరించా. ఇది ఆర్థికంగా ఆదుకుంది. ఈ సీరియల్‌కు నలుగురు వ్యక్తులం డైరెక్టర్లుగా పనిచేసాం. సుమారు 680 ఎపిసోడ్‌లను రెండున్నర  ఏళ్ల పాటు తీశాం. సినీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు అలవాటు పడ్డాం. డిజిటల్‌ టెక్నాలాజీపై అవగాహన పెరిగింది. తక్కువ బడ్జెట్‌తో ఆరునెలల 20 రోజుల్లో 6 పాటలతో  ‘ఇదీ ప్రేమంటే ’ సినీమా తీశాం. దాసరి స్ఫూర్తితో  షార్ట్‌ పిల్మ్‌ కల్చరల్‌ తీయటానికి ఆరురోజుల పాటు 64 సినిమాలు నిర్మించాం. 100 రోజుల్లో 100 షార్ట్‌ ఫిల్మŠస్‌ తీసిన ఘనత దక్కించుకున్నాం. 
 
ప్రశంసల జల్లు... 
2013 సంవత్సరంలో సాయికిరణ్‌ హీరోగా ‘కిట్టుగాడు’ సినిమాను 2013 డిసెంబర్‌ 07న రిలీజ్‌ చేశాం. దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మరణాన్ని ‘వైఎస్‌ మహాప్రస్థానం’ పేరుతో నిర్మించిన వీడియో మన్ననలు అందుకుంది. ఇప్పటివరకు పిల్లలుకాదు పిడుగులు, కిట్టిగాడు, ఇదీ ప్రేమంటే, వై.ఎస్‌.మహాప్రస్థానం, ఆడవిలో ఏం జరిగింది, రేపటి పౌరులు, రెండు తదితర 12 సినిమాలకు డైరెక్టరుగా వ్యవహరించా. 2013లో 100 రోజుల్లో 100 షార్ట్‌ ఫిల్మ్‌లు తీసినందుకు ఢిల్లీ లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డు సొంతమైంది. 2016లో సింగపూర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. బాహుబలిలోని దండాలయ్య... సినీ గీతాన్ని రైతులకు అనువదించి సందేశాత్మక వీడియోను ఆవిష్కరించాం. దీనికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మెచ్చుకున్నారు. జ్ఞాపికతలతో సత్కరించారు. దీనిని హిందీలో నిర్మించాలని సూచించారు. నచ్చిన రంగంలో కష్టాలు ఎదురైనా ముందుకు సాగవచ్చని, యువత ఆ దిశగా పయనించాలని సందేశమిచ్చారు.  
 

Advertisement

తప్పక చదవండి

Advertisement