'విభజనను చూసి భయపడొద్దు' | digvijaya singh assurance on Seemandhra leaders | Sakshi
Sakshi News home page

'విభజనను చూసి భయపడొద్దు'

Mar 15 2014 2:23 PM | Updated on Mar 18 2019 9:02 PM

'విభజనను చూసి భయపడొద్దు' - Sakshi

'విభజనను చూసి భయపడొద్దు'

రాష్ట్ర విభజనను చూసి భయపడొద్దని.... సీమాంధ్ర కాంగ్రెస్‌ నాయకులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ భరోసా ఇచ్చారు.

హైదరాబాద్ : రాష్ట్ర విభజనను చూసి భయపడొద్దని.... సీమాంధ్ర  కాంగ్రెస్‌ నాయకులకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ భరోసా ఇచ్చారు. సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్న సంగతి మరవొద్దని సూచించారు.  హైదరాబాద్‌ గాంధీ భవన్‌ వెనక కొత్తగా నిర్మించిన ఇందిరా భవన్‌లో జరిగిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో దిగ్విజయ్‌ సింగ్‌ పాల్గొన్నారు. త్వరగా అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని కొత్త కమిటీకి దిగ్విజయ్‌ సింగ్‌ దిశానిర్దేశం చేశారు.

ఎన్నికల మ్యానిఫెస్టోను కూడా త్వరగా రూపొందించాలని దిగ్విజయ్ ఆదేశించారు. ముందు లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై  దృష్టి పెట్టాలని...అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను వాళ్లే చూసుకుంటారని సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీకి ఆయన సూచించారు. మరో వైపు సీమాంధ్ర పీసీసీలోనూ  వర్కింగ్‌  ప్రెసిడెంట్‌ పదవి ఏర్పాటు చేయాలని తిరుపతి ఎంపీ చింతా మోహన్‌ ఈ సందర్భంగా దిగ్విజయ్‌ను కోరారు.  సీమాంధ్ర పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని దళితులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement