తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల చిరకాల స్వ ప్నం సాకారమవుతున్న వేళ జరుపుకుంటున్న దసరా పండుగ ప్రత్యేకమైనదని భారీ నీటిపారుదల మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు
న్యూస్‌లైన్, నెట్‌వర్క్ :
తెలంగాణ ప్రజల ఆరు దశాబ్దాల చిరకాల స్వ ప్నం సాకారమవుతున్న వేళ జరుపుకుంటున్న దసరా పండుగ ప్రత్యేకమైనదని భారీ నీటిపారుదల మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజ లు దసరాను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు, రైతులు, అధికారుల కు, అనధికారులకు ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, జిల్లా ఎస్పీ కేవీ మో హన్‌రావు, జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి వేర్వేరు ప్రకటనల్లో దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా విజయాలు చేకూర్చాలని ఆకాంక్షించారు.
బాజిరెడ్డి..
జిల్లా ప్రజలకు వైఎస్సార్ సీ పీ కేంద్ర పాలక మండలి స భ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ద సరా, బక్రీద్ పండుగల శు భాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలను ప్రజలు ఘనంగా నిర్వహించుకోవాల ని, సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు


