హోటల్‌లో పేలిన సిలిండర్:నలుగురికి గాయాలు | cylinder Bursting at a hotel : four members injuries | Sakshi
Sakshi News home page

హోటల్‌లో పేలిన సిలిండర్:నలుగురికి గాయాలు

Apr 12 2015 10:22 PM | Updated on Sep 3 2017 12:13 AM

విజయనగరం మూడులాంతర్ల సెంటర్ వద్ద ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది.

విజయనగరం: స్థానిక మూడులాంతర్ల సెంటర్ వద్ద ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బాధితులను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి హోటల్ ధ్వంసమయింది. హోటల్ మొత్తం ధ్వంసమయినా కౌంటర్‌లోని నగదు మాత్రం సురక్షితంగా ఉండటంతో యజమాని కాసింత ఊపిరిపీల్చుకున్నాడు.

మంటలు చెలరేగిన సమయంలో పేలిన సిలిండర్ పక్కనే మరో మూడు సిలిండర్‌లు ఉన్నాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement