
వారణాసికి 120 కిలోమీటర్ల దూరంలో తుఫాను
ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన హుదూద్.. ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పై ఆవరించింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిషాలలో తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన హుదూద్.. ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల పై ఆవరించింది. విశాఖపట్నంలో తీరాన్ని తాకిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారిన హుదూద్.. అక్కడినుంచి పయనించి, ఇప్పుడు ఛత్తీస్గఢ్ చేరుకుంది.
దాంతో పాటు మధ్యప్రదేశ్ మీద కూడా ఆవరించి ఉంది. మధ్యప్రదేశ్కు ఈశాన్యంగా, ఉత్తరప్రదేశ్కు తూర్పు దిశలో ఈ తుఫాను కదులుతోంది. ప్రస్తుతం వారణాసికి నైరుతి దిశలో 120 కిలోమీటర్ల దూరంలో హుదూద్ ఉన్నట్లు జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.