ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అరెస్ట్ చేయాలంటూ సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు.
గుంటూరు: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని అరెస్ట్ చేయాలంటూ సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన అన్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం జరిగిన సీపీఐ సదస్సులో ఆయన పాల్గొన్నారు. కాగా, ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా చేర్చాలని పలుపార్టీల నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.