వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం | Couple attempt suicide | Sakshi
Sakshi News home page

వేధింపులతో దంపతుల ఆత్మహత్యాయత్నం

Oct 13 2015 3:44 PM | Updated on Jul 10 2019 7:55 PM

పొరుగువారు వేధిస్తున్నారంటూ అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించారు.

కల్యాణదుర్గం (అనంతపురం) : పొరుగువారు వేధిస్తున్నారంటూ అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. పట్టణంలోని దేవీరమ్మ కాలనీకి చెందిన సిద్ధప్ప, దాసరి వెంకటేశు ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. వారి మధ్య గత మూడేళ్లుగా చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి.

వాటికి సంబంధించి వెంకటేశు పోలీస్‌స్టేషన్‌లో సిద్ధప్పపై ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల క్రితం వెంకటేశు సిద్ధప్ప భార్య చిత్తమ్మతో అసభ్యంగా మాట్లాడాడు. వీటన్నిటితో మనస్తాపం చెందిన సిద్ధప్ప, చిత్తమ్మ మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే పురుగు మందు తాగారు. కొద్దిసేపటి తర్వాత కుటుంబసభ్యులు గమనించి కల్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement