కరోనా: ఏపీలో మరో 62 పాజిటివ్‌ కేసులు | Coronavirus 62 New Positive Cases Reported In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కరోనా: ఏపీలో మరో 62 పాజిటివ్‌ కేసులు

May 2 2020 11:48 AM | Updated on May 2 2020 12:20 PM

Coronavirus 62 New Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 5943 నమూనాలను పరీక్షించగా.. 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం ప్రకటించింది.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 5943 నమూనాలను పరీక్షించగా.. 62 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1525 కు చేరుకుందని తెలిపింది. కోవిడ్‌ బాధితుల్లో తాజాగా 38 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 441 కు చేరుకుందని పేర్కొంది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదల చేసింది. 
(చదవండి: పేటపై స్పెషల్‌ ఫోకస్‌)


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement