రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది: ధర్మాన | Congress party in ICU says Dharmana Prasada Rao | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది: ధర్మాన

Dec 15 2013 1:56 PM | Updated on Mar 18 2019 7:55 PM

రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది: ధర్మాన - Sakshi

రాష్ట్రంలో కాంగ్రెస్ పనైపోయింది: ధర్మాన

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆ పార్టీకి అధికారమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆ   పార్టీకి అధికారమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. అందుకోసం ఎవరు పిలిస్తే వారితో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దమని ధర్మాన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీనే వద్దని పార్టీ కార్యకర్తలు అంటున్నారని ఆయన పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో ఉండాలా వద్దా అనే అంశంపై మాజీ మంత్రి ధర్మాన శ్రీకాకుళంలో ఆదివారం జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమై చర్చించారు. ఈ సందర్బంగా తమకు కాంగ్రెస్ పార్టీ అక్కరలేదని ఆ పార్టీ కార్యకర్తలే ధర్మాన వద్ద తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ధర్మాన ఏర్పాటు చేసిన సమావేశానికి శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement