ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్ పార్టే అని రాష్ట్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రాంచంద్రాపురంతండా వద్ద * 36.16 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలను గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.
పెదవీడు (మఠంపల్లి), న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్ పార్టే అని రాష్ట్ర భారీపరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని రాంచంద్రాపురంతండా వద్ద * 36.16 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలను గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం పెదవీడులో జరిగిన బహిరంగసభలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ఈ ప్రాం త ప్రజలు దశాబ్దాలుగా వెలిబుచ్చుతున్నందుకే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వచ్చే జనవరిలోపు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
సోనియాగాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి తిరిగి రెండు నాల్కలధోరణితో సీమాంధ్రలో అలజడులు సష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న భారీ, చిన్నతరహా పరిశ్రమలలో స్థానిక యువతకు 80 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే షరతులతోనే ఆయా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హయాం లో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలైతే, సోనియాగాంధీ నాయకత్వంలో 50 శాతం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎత్తిపోతల పథకాలను సాధించడంలో మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచారన్నారు.
అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హుజూర్‌నగర్‌కు తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక నాలుగేళ్లలో వందల కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కృష్ణానదిపై ఎత్తిపోతలను రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా నిర్మించినట్లు చెప్పారు. త్వరలో ఏర్పడబోయే ప్రత్యేక రాష్ట్రంలో మంత్రి గీతారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించబోతున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రులను ఏపీఎస్‌ఐడీసీ డెరైక్టర్ సాముల శివారెడ్డి దంపతులు, ఎత్తిపోతల కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు, రెడ్డి, యాదవ, గిరిజన యువజనసంఘాలు, కళాకారులు, మండల, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు శాలువాలు, మెమోంటోలతో ఘనంగా సత్కరిం చారు. కార్యక్రమంలో బ్లాక్, మండల అధ్యక్షులు అరుణ్‌కుమార్ దేశ్‌ముఖ్, భూక్యా మంజీనాయక్, సర్పంచ్ చిలకసీతమ్మ, ఎత్తిపోతల చైర్మన్ సాముల భాస్కర్‌రెడ్డి, ఏపీఎస్‌ఐడీసీ ఎండి రత్నకుమా ర్, ఎస్‌ఈ భాస్కర్‌రెడ్డి, ఈఈ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.