రుణమాఫీకి ని‘బంధనాలు’ | conditions to loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి ని‘బంధనాలు’

Aug 22 2014 2:29 AM | Updated on Jun 4 2019 5:04 PM

రుణమాఫీ అమలులో ప్రభుత్వం ఒక రకంగా ఇబ్బందికి గురిచేస్తుంటే..

 నంద్యాల:  రుణమాఫీ అమలులో ప్రభుత్వం ఒక రకంగా ఇబ్బందికి గురిచేస్తుంటే.. సమాచారం పేరుతో మరో రకంగా బ్యాంకులు ఇబ్బందులకు గురిచేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అర్థంపర్థంలేని సమాచారాన్ని అందజేయాలని కోరడంతో రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయలేకపోతున్నారు. రెండు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో బ్యాంకర్లకు అవసరమైన పత్రాలను అందజేసేందుకు నానాఅవస్థలు పడుతున్నారు.

రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల జోవో 174 విడుదల చేయడంతో రేషన్‌కార్డు, పన్ను చెల్లింపు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్, పాసు పుస్తకం జిరాక్స్‌ను అందజేయాలని బ్యాంకర్లు కోరుతున్నారు. నంద్యాల మండలంలోని దాదాపు 3800మంది రైతులు పంట రుణాల కింద దాదాపు రూ. 24కోట్లు తీసుకున్నారు. దీంతో రైతులు సంబంధిత పుస్తకాలను, కార్డులను పట్టుకుని జిరాక్స్ కేంద్రాలు, ఫొటో స్టూడియోల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. పంట రుణం తీసుకున్న రోజే పొలానికి సంబంధించిన పాసుపుస్తకం జిరాక్స్‌ను బ్యాంకులో అందజేశామని, ఇప్పుడు వాటి వివరాలు, పన్ను రశీదు కావాలనడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement