ఉపాధ్యాయురాలిపై ఎంఈవోకు ఫిర్యాదు | Complaint To MEO Against bad Teacher In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయురాలిపై ఎంఈవోకు ఫిర్యాదు

Aug 3 2018 11:43 AM | Updated on Aug 6 2018 1:09 PM

Complaint To MEO Against bad Teacher In Visakhapatnam - Sakshi

విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగికి ఫిర్యాదు పత్రాన్ని అందజేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

రావికమతం(చోడవరం): విద్యార్థులను దుర్భాషలాడుతున్న  గొంప యూపీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు ఎల్లాజమ్మపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్‌ కమిటీ చైర్మన్‌ గురువారం ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.  ఎల్లాజమ్మ గణితం బోధిస్తున్నారు. తరగతి గదిలో   విద్యార్థులు సందేహాలు వ్యక్తం చేస్తే, తీర్చడం లేదు సరికదా తీవ్రంగా దుర్భాషలాడుతున్నారని, భోజనం అనంతరం తన క్యారియర్‌ను  విద్యార్థులతో కడిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెకు భయపడి పాఠశాలకు వెళ్లేందుకు తమ పిల్లలు నిరాకరిస్తున్నారని తెలిపారు.  అందువల్ల ఆమెను బదిలీచేయాలని  ఆ స్కూల్‌ కమిటీ చైర్మన్‌ పిల్లా పెద అప్పలనాయుడు,డైరెక్టర్‌ సత్తిబాబు,నడిశెట్టి కన్నబాబు,కె.సత్తిబాబు,ఎం.నాయుడుబాబు, పి.శేఖర్‌ తదితరులు ఫిర్యాదు చేశారు.  విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈవో లేకపోవడంతో  అక్కడి ఉద్యోగికి పెంటయ్యకు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఈ విషయమై మండల విద్యాశాఖాధికారిని సంప్రదించగా ఫిర్యాదు అందిందని,జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement