ఎవరినీ వదలొద్దు..

Collectors Conference With AP CM YS Jagan Mohan Reddy - Sakshi

నగరాలు, పట్టణ ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువ

ప్రతి కుటుంబాన్ని వలంటీర్లతో పరిశీలన చేయించండి   

జిల్లా అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

తూర్పుగోదావరి, ,కాకినాడ సిటీ: నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. సోమవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి రోజు ప్రతి కుటుంబాన్ని వార్డు స్థాయిలో వలంటీర్లు పరిశీలన చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో టీమ్స్‌ బాగా పని చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు బాధ్యత ఉందన్నారు. గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు వివరించారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌తో మాట్లాడుతూ యువ అధికారుల నుంచి ప్రభుత్వం మరింత సేవలను ఆశిస్తుందన్నారు. దానికి అనుగుణంగా పని చేయాలన్నారు.

కోవిడ్‌–19 కేసుల కోసం జిల్లాలో కిమ్స్‌ ఆసుపత్రిలో నాన్‌ ఐసీయూ బెడ్స్‌ 730 నుంచి 800లకు, ఐసీయూ బెడ్‌లు 52 నుంచి 70కి పెంచుతున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి బి రాజశేఖర్, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ, జేసీ–2 రాజకుమారి, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం కరోనా నియంత్రణ ప్రత్యేకాధికారి బి రాజశేఖర్‌ విద్యాశాఖాధికారులతో మాట్లాడారు. పాఠశాలలకు సంబంధించి నాడు–నేడు కార్యక్రమం చేపట్టిన పనులను పూర్తి చేసేలా చూడాలన్నారు. జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్‌ 24 వరకు కావల్సిన రేషన్‌ ఉంచి, మిగతా వాటిని జిల్లా యంత్రాంగానికి ఇచ్చేయాలని ఆదేశించారు. రైతు బజారుల్లో వ్యాయామ ఉపాధ్యాయులను కరోనా నియంత్రణలో భాగంగా వారి సేవలను వినియోగించాలన్నారు.

కలెక్టరేట్‌లో టెలీహబ్‌ ఏర్పాటు
కాకినాడ సిటీ: స్థానిక కలెక్టరేట్‌లోని అబ్జర్వేషన్‌ సెంటర్‌లో టెలీహబ్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి సోమవారం తెలిపారు. ఆరుగురు వైద్యులతో ఈ హబ్‌ 24 గంటలు పని చే స్తుందన్నారు. జలుబు, దగ్గుతో బాధపడే వారు ఏ సమయంలోనైనా ఫోన్‌ ద్వారా ఈ వైద్యుల సలహాల కోసం 0886 2333466, 0884 2333488 నంబర్లను సంప్రదించాలనిఆయన సూచించారు. 

కోవిడ్‌–19 కాల్‌ సెంటర్‌
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌–19 కాల్‌ సెంటర్‌కు వ్యక్తిగతంగా ఎవరినీ అనుమతించమని కలెక్టర్‌ తెలిపారు. వైద్య, రవాణా, పౌర సరఫరాలు, పోలీస్‌ తదితర అత్యవసర సమస్యలున్న వారు కంట్రోల్‌ రూమ్‌లోని కాల్‌ సెంటర్లను 1800 425 3077, 0884 2356196, 93923 24287కు ఫోన్‌ చేసి సంప్రదించాలని కలెక్టర్‌ సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

25-05-2020
May 25, 2020, 13:02 IST
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: గమ్యానికి వెళుతూ ఓ వలస కూలీ మృతి చెందాడు. ఒడిశాలోని బరంపురం సమీపంలో పాశియా గ్రామానికి...
25-05-2020
May 25, 2020, 12:26 IST
సాక్షి, ముంబై:  బాలీవుడ్  సూపర్  స్టార్  సల్మాన్ ఖాన్ కొత్త వ్యాపరంలోని అడుగు పెట్టాడు. కరోనా సంక్షోభ సమయంలో  సమయానికి తగినట్టుగా శానిటైజర్...
25-05-2020
May 25, 2020, 12:22 IST
న్యూయార్క్‌ : ‘రీ ఓపెన్‌ అమెరికా’ ఉద్యమం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రీ...
25-05-2020
May 25, 2020, 11:53 IST
బీజింగ్‌ : దక్షిణ చైనా సముద్రంపై పట్టు కోసం చైనా కరోనా వైరస్‌ వ్యాప్తిని ఉపయోగిస్తుందనే వార్తలను ఆ దేశం కొట్టిపారేసింది. ఆ...
25-05-2020
May 25, 2020, 11:35 IST
సాక్షి, ముంబై : కరోనా సంక్షోభంతో  తన చరిత్రలోనే   టాటా గ్రూపు టాప్ మేనేజ్ మెంట్ తొలిసారి కీలక నిర్ణయం...
25-05-2020
May 25, 2020, 11:28 IST
మహబూబ్‌నగర్‌, కొత్తకోట రూరల్‌: కరోనా వైరస్‌ సోకి మృతిచెందాడనే అనుమానంతో ఇతర రాష్ట్రంలో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామంలోకి...
25-05-2020
May 25, 2020, 11:01 IST
ప్రముఖ హిందీ కమెడియన్‌ వీర్‌ దాస్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరలవుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన...
25-05-2020
May 25, 2020, 10:48 IST
కరోనా అంటే అలాగ.. కరోనా అంటే ఇలాగ. మాస్కు వేసుకోవాలి.. భౌతిక దూరం పాటించాలి.. దగ్గొస్తది.. తుమ్మొస్తది. ఇలా కోవిడ్‌–19...
25-05-2020
May 25, 2020, 10:27 IST
సాక్షి, సిటీబ్యూరో:  గ్రేటర్‌లో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది.  ఆదివారం 23 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  అంబర్‌ పేట...
25-05-2020
May 25, 2020, 09:39 IST
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో...
25-05-2020
May 25, 2020, 09:16 IST
అబిడ్స్‌/జియాగూడ: కరోనా మహమ్మారిని నివారించేందుకు జియాగూడ మున్సిపల్‌ డివిజన్‌లో అర్బన్‌ హెల్త్‌ ప్రైమరీ సెంటర్‌ వైద్యాధికారులు, ఆశ వర్కర్లు, పోలీసులు...
25-05-2020
May 25, 2020, 09:16 IST
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ కు చెందిన ఆన్‌లైన్ వెంచర్ జియో మార్ట్ ఆన్‌లైన్ గ్రోసరీ సేవలను ప్రాంరంభించింది. గత నెల...
25-05-2020
May 25, 2020, 09:00 IST
బాల్యం విలవిల్లాడుతోంది..ఆటపాటల్లేవని ఆందోళన చెందుతోంది..కరోనా దెబ్బకు కన్నీరు పెడుతోంది..అమ్మానాన్నలతో ఆడుతూ..   పాడుతూ ఉండాల్సిన ఆ పసిపిల్లలు ఎండకు మాడిపోతున్నారు..ఆకలితో అల్లాడుతున్నారు....
25-05-2020
May 25, 2020, 08:57 IST
సాక్షి, సిటీబ్యూరో:  ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడుతున్నారు. ఇదే సమయంలో...
25-05-2020
May 25, 2020, 08:39 IST
కుత్బుల్లాపూర్‌:  కోవిడ్‌–19 ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమలు కుదేలవుతున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మన దగ్గర కరోనా...
25-05-2020
May 25, 2020, 08:29 IST
ముంబై : మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఆగడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 50 వేలు దాటింది. అయితే...
25-05-2020
May 25, 2020, 08:20 IST
సాక్షి,సిటీబ్యూరో: కరోనా నియంత్రణలో విశ్రాంతి లేని డ్యూటీలు, సమయానికి ఆహారం నిద్ర కరవుతో ఇబ్బంది పడుతున్న కింది స్థాయి పోలీస్‌...
25-05-2020
May 25, 2020, 07:53 IST
అనంతపురం: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించడం కోసం అనంతపురం నగరంలో ఆదివారం చికెన్‌ , మటన్‌ దుకాణాలను మూసి­వేయాలని...
25-05-2020
May 25, 2020, 06:41 IST
న్యూఢిల్లీ:  లాక్‌డౌన్‌ వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది మంది వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావడం... దేశ విభజన తర్వాత...
25-05-2020
May 25, 2020, 06:30 IST
ముంబై: లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేయడం సరి కాదనీ, దీని వల్ల రెండింతల నష్టం సంభవించవచ్చని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top