జర ‘పది’లం సారూ! | collector gives suggestion to officers | Sakshi
Sakshi News home page

జర ‘పది’లం సారూ!

Jan 23 2014 5:10 AM | Updated on Oct 17 2018 6:06 PM

పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారు ఈ మేరకు రంగంలోకి దిగారు.

 నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వారు ఈ మేరకు రంగంలోకి దిగారు. ఇటీవల జరిగిన అర్ధవార్షిక పరీక్షల జవాబు పత్రాలలో ప్రతి సబ్జెక్టు నుంచి పది పేపర్ల చొప్పున ఎంపిక చేసుకున్నారు. వాటిని ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేస్తున్నారు.

ఇందుకు ఆయా సబ్జెక్టులలో నిపుణులైన 50 మంది టీచర్లను వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో గల ఎంఎస్‌ఆర్ పాఠశాలలో వారం రోజుల నుంచి ఈ వాల్యుయేషన్ ప్ర క్రియ కొనసాగుతోంది. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థుల మెరిట్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని పాఠశాలలలో సంబంధిత టీచర్లే జవాబు పత్రాలను దిద్ది అనుకూలంగా మార్కులు వేయడంలాంటి చర్యలను గుర్తిస్తున్నారు.

 ఇటువంటి వాటికి చెక్‌పెట్టి విద్యార్థుల ప్రతిభను స్వయంగా గుర్తించాలని కలెక్టర్ నిర్ణయించుకున్నారు. ఇతర టీచర్లచే వాల్యుయేషన్ చేయిస్తే సరైన ఫలి తా లు రాబట్టవచ్చునని అభిప్రాయపడుతున్నారు. మరో వారం రోజుల్లో ఈ వాల్యుయేషన్ పూర్తి చేసి మిగిలిన 55 రోజులలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిం చేందుకు వారిని ఎలా సన్నద్ధం చేయాలో ప్రణాళిక రూపొందించనున్నారు. దీం తో మెరుగైన ఫలితాలు రాబట్టే ఆవకాశం ఉంది. వీటి ఆధారంగా వెనకబడిన పా ఠశాల లోపాలు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

 గత వైభవం కోసం
 గతంలో పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో వరుసగా మూడుసార్లు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జిల్లా 18, 21 స్థానాలకు పడిపోయింది. గతంలో వరుసగా జిల్లా నంబర్ వన్ రావడంతో పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా మంత్రి కూడా స్పందించారు.ప్రతిభతో కూడి న మెరుగైన ఫలితాలు మాత్రమే రావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిం చా రు. జిల్లా కలెక్టర్ సైతం ఫలితాలపై దృష్టి పెట్టడంతో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాగైనా మంచి ఫలితాలు రాబట్టాలని ప్రధానోపాధ్యాయులకు, ఎంఈఓలకు నిత్యం సూచనలు జారీ చేస్తున్నారు.  వాల్యుయేషన్ జరుగుతోంది. - శ్రీనివాసాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి

 అర్ధవార్షిక పరీక్షల జవాబు పత్రాలను ప్రత్యేకంగా వాల్యుయేషన్ చేస్తున్నాం. జిల్లాలో 40 పాఠశాలల నుంచి జవాబు పత్రాలు తెప్పించాం. జిల్లా కలెక్టర్ ఆదేశాను సారంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఫలితాల ఆధారంగా మెరుగైన ఫలితాల కోసం కృషి చేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement