కోడెల మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి | CM YS Jagan Express Condolences To Kodela Sivaprasad Rao | Sakshi
Sakshi News home page

కోడెల మృతి పట్ల సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Sep 16 2019 2:27 PM | Updated on Sep 16 2019 6:17 PM

CM YS Jagan Express Condolences To Kodela Sivaprasad Rao - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

(చదవండి : కోడెల శివప్రసాదరావు కన్నుమూత)

కేసీఆర్‌ సంతాపం..
కోడెల శివప్రసాదరావు మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోడెల మృతిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విచారం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఓ ప్రకటనలో తెలిపారు. కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని ప్రకటించారు.

శివప్రసాదరావు మృతి విచారకరం: ఉప రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి విచారకరమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కోడెల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసబ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement