
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 2న (మంగళవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 2న (మంగళవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ కానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన నివారణ చర్యలను, పెద్దఎత్తున నిర్వహించిన కరోనా పరీక్షల గురించి అమిత్ షాకు ఆయన వివరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కూడా అమిత్ షా దృష్టికి తీసుకురానున్నారు.
వలస కూలీల తరలింపుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను ఈ భేటీలో వీరిద్దరు చర్చించనున్నారు. కాగా, కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను సీఎం వైఎస్ జగన్ కలిసే అవకాశం ఉంది. పోలవరం నిధుల గురించి ఆయనతో చర్చించనున్నారు. అవకాశాన్ని బట్టి మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం బయలుదేరి వెళ్లనున్నారు. తిరిగి బుధవారం రానున్నారు. సీఎం వెంట ఢిల్లీకి పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లనున్నారు.