అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఎస్సెల్‌ గ్రూప్‌కు ఇచ్చేద్దామా! | CM comments about Agrigold assets in Cabinet meeting | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఎస్సెల్‌ గ్రూప్‌కు ఇచ్చేద్దామా!

Sep 10 2017 2:55 AM | Updated on Jul 28 2018 3:41 PM

లక్షల మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్రకు (జీ మీడియా గ్రూపు మాజీ చైర్మన్‌) కట్టబెట్టేందుకు చంద్రబాబుమంతనాలు సాగిస్తున్నారు.

మంత్రివర్గ భేటీలో సీఎం మంతనాలు
 
సాక్షి, అమరావతి: లక్షల మందిని నట్టేట ముంచిన అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను ఎస్సెల్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుభాష్‌ చంద్రకు (జీ మీడియా గ్రూపు మాజీ చైర్మన్‌) కట్టబెట్టేందుకు చంద్రబాబుమంతనాలు సాగిస్తున్నారు. శనివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు సమాచారం. అగ్రిగోల్డ్‌ కేసు పురోగతికి సంబం ధించిన వివరాలను ఏసీబీ అధికారులు మంత్రివర్గం ముందుంచిన తర్వాత సంస్థకు సంబంధించిన ఆస్తులు చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఈ సమయంలో ఆస్తులన్నింటినీ ఒకే సంస్థ లేదా వ్యక్తికి అమ్మేస్తే ఇబ్బందులుండవని ముఖ్యమంత్రి చెప్పారు. పెద్ద మొత్తం వెచ్చించి ఎవరు కొంటారనే ప్రశ్న రాగా.. ఎస్సెల్‌ గ్రూప్‌ సిద్ధంగా ఉందని చంద్రబాబు అన్నారని తెలిసింది. నాలుగు రోజుల క్రితం ఆయన తన వద్దకు వచ్చి ఈ ఆస్తుల కొనుగోలు అంశంపై చర్చించారని, దీనిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement