ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లాలో ఉన్న అపారమైన సంపద కోసం విశాఖపై ప్రేమను ఒలకబోస్తున్నాడని కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి మావోయిస్టు విజయలక్ష్మి గురువారం ఓ లేఖలో పేర్కొన్నారు.
పాడేరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం జిల్లాలో ఉన్న అపారమైన సంపద కోసం విశాఖపై ప్రేమను ఒలకబోస్తున్నాడని కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి మావోయిస్టు విజయలక్ష్మి గురువారం ఓ లేఖలో పేర్కొన్నారు. కూంబింగ్‌ల పేరుతో మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులను చంద్రబాబు చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఆమె తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించాలని ప్రజలను కోరారు. విశాఖపట్నంలో ఖనిజ సంపద దోపిడీకి ప్రణాళికలు రచించాడని చంద్రబాబుపై విజయలక్ష్మి నిప్పులు చెరిగారు.